గుబ్బి వీరణ్ణ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
గుబ్బిహంపన్నవీరణ్ణ
జననం(1891-01-24)1891 జనవరి 24
మరణం1972 అక్టోబరు 18(1972-10-18) (వయసు 81)
బెంగళూరు (సెయింట్. మార్తాస్ ఆసుపత్రి)
వృత్తిరంగస్థలదర్శకుడు,నటుడు
పిల్లలుజి.వి. స్వర్ణమ్మ, జి. వి. మాలతమ్మ, జి. వి. చెన్నబసప్ప, జి. వి. గిరిజమ్మ, జి. వి. రేవమ్మ, జి. వి. రాజశేఖర్, జి. వి. శివానంద్, జి. వి. శివరాజ్, జి. వి. గురుమూర్తి, జి. వి. లతమ్మ, జి. వి. ప్రభ.

గుబ్బి వీరణ్ణ (1891 – 1972) కన్నడ రంగస్థల దర్శకుడు, నటుడు. కన్నడ రంగస్థలానికి అత్యంత గొప్ప కృషి చేసిన వ్యక్తులలో ఆయన ఒకరు. "గుబ్బి శ్రీ చెన్నబసవేశ్వర నాటక కంపెనీ" పేరిట ఆయన నెలకొల్పిన నాటక సంస్థ కన్నడ రంగస్థలం అభివృద్ధిలో కీలకమైన పాత్ర పోషించింది.

నాటక రత్న బిరుదు, పద్మశ్రీ పురస్కారం అందుకున్నారు. గుబ్బి వీరణ్ణ నాటక సంస్థ కర్ణాటకలో స్త్రీలను నాటకాల్లో పాత్రలు వేసేలా ప్రోత్సహించిన తొలి సంస్థ.  కురుక్షేత్ర యుద్ధ ఘట్టాలను నాటకంలో ప్రదర్శించాల్సి వచ్చినప్పుడు అందులో భాగంగా ఏనుగులు, గుర్రాలు కూడా గుబ్బి వీరణ్ణ వేదిక మీదిక తీసుకురావడం సంచలనాత్మకంగా, అద్భుతావహంగా నిలిచింది. గుబ్బి వీరణ్ణ కంపెనీ కథే, కన్నడ రంగస్థలం కథ అన్న నానుడి కన్నడ రంగస్థలానికి ఆయన చేసిన సేవను తెలియజేస్తుంది. గుబ్బి వీరణ్ణ రంగస్థలమే కాక సినిమా రంగంలోకీ ప్రవేశించి సినిమాలను నిర్మించి వాటిలో నటించారు.

1955లో సంగీత నాటక అకాడెమీ ద్వారా నటన రంగంలో సంగీత నాటక అకాడెమీ పురస్కారాన్ని, కళారంగానికి చేసిన సేవకుగాను భారత ప్రభుత్వపు నాలుగవ అత్యుత్తమ పౌర పురస్కారమైన పద్మశ్రీ పురస్కారాన్నీ అందుకున్నారు. 

జీవిత విశేషాలు

[మార్చు]

గుబ్బి వీరణ్ణ కర్ణాటకకు చెందిన తుముకూరు జిల్లా గుబ్బిలో 1891లో జన్మించారు. ఆయన గుబ్బి శ్రీ చెన్నబసవేశ్వర నాటక కంపెనీ అన్న సంస్థను స్థాపించి, నాటకాలను నిర్మించి, కొన్నిసార్లు నటించడం కూడా చేశారు. ఆయనకు నలుగురు భార్యలు, వారిలో ముగ్గురి పేర్లు: సుందరమ్మ, భద్రమ్మ, జయమ్మ. నాటక రంగం పట్ల ఆయన తిరుగులేని నిబద్ధతతో కృషిచేశారు. దీనికి తార్కాణంగా ఒక సంఘటన చెప్తారు, గుబ్బి హంపణ్ణ రెండో భార్య సుందరమ్మ మరణించిన సంగతి రంగస్థల వేదికపై ఉండగా తెలిసింది. పిల్లలతో కూడి నటనలో నిమగ్నమైన ఆయన ప్రదర్శనను ఆ కారణంగా ఆపడం కానీ, వేదిక దిగి వెళ్ళడం కానీ చేయలేదు. నాటకం పూర్తయ్యాకనే వెళ్ళారు. 

రాజ్ కుమార్ నరసింహరాజు, బాలకృష్ణ, జి.వి.అయ్యర్బి.వి. కారంత్మాస్టర్ హిరణ్ణయ్య వంటి ప్రఖ్యాత నటులు, రంగస్థల కళాకారులను తీర్చిదిద్దిన ఘనత వీరణ్ణకు దక్కుతుంది. వారిని రంగస్థలంపై ప్రోత్సహించి, తీర్చిదిద్దడమే కాక ఆర్థికంగానూ ఆదుకున్నారు. ఉదాహరణకు, బి.వి. కారంత్ బెనారస్ హిందూ విశ్వవిద్యాలయంలో డిగ్రీ, మాస్టర్స్ చదివేందుకు వీరణ్ణ ఆర్థికంగా సాయం చేశారు.